HomeTelugu Big Storiesబాబాయ్ పిలుపు కోసమే వెయిట్ చేస్తున్నా..!

బాబాయ్ పిలుపు కోసమే వెయిట్ చేస్తున్నా..!

1 4బాబాయ్ పిలవాలే కాని ఎలాంటి సహకారానికైనా ముందుంటా అన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా విశేషాల్ని తెలియజేస్తూ.. పవన్ కళ్యాణ్‌పైన, జనసేన పార్టీపైన రామ్‌ చరణ్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. బాబాయ్‌(పవన్ కళ్యాణ్) ఒక్క పిలుపు ఇవ్వాలే కాని ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆయన నా బాబాయ్. అవసరమైతే జనసేన తరపున ప్రచారం చేస్తా. అదే సందర్భంలో ఆయనకు నచ్చని పని నేను చేయను.. చేయాలని అనుకోను. ఆయనకు అనిపించి ఒక్క పిలుపు. ఒక్క ఫోన్‌ కాల్ చేస్తే నేను ఎప్పుడూ రెడీగా ఉంటా. బాబాయ్‌ ఏం అడిగినా పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తా.

బాబాయ్‌ని నేను దగ్గర నుండి చూశా కాబట్టి.. ఆయనకి మానుండి సాయం అడగటానికి కూడా పెద్దగా మొహమాట పడరు. ఆయనకు అనిపించాలి అంతే.. తప్పకుండా పిలుస్తారు. ఆయన పిలుపు కోసమే వెయిట్ చేస్తున్నా’ అన్నారు రామ్ చరణ్. ఇక మా బాబాయ్ నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే.. ఫియర్ లెస్ యాటిట్యూట్. బాబాయ్‌ ప్రతిరోజు అందుబాటులో ఉండే వ్యక్తి కాదు. కాని కష్టం వచ్చిందంటే నా మైండ్‌లో ఫస్ట్ పర్సన్ కళ్యాణ్ బాబాయ్’ అంటూ పవన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu