ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఇటీవల కాలంలో వరుస వివాదాల చిక్కుకుంటున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్ సీ15” అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8 నుండి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. దీంతో శంకర్ ఇప్పుడు కొత్త ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ మేరకు శంకర్ పై ఫిర్యాదు చేస్తూ చెన్నైలో ఉన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చిన్నసామి సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ (SIFWA)ని సంప్రదించాడు. అతను తన స్క్రిప్ట్‌ను శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ దొంగిలించారని పేర్కొన్నాడు. అయితే శంకర్ కూడా ఆ ఆరోపణలను నిజం కాదని నిరూపించడానికి ముందుకొచ్చారు. రెండు పార్టీలు తమ స్క్రిప్ట్‌లను సమర్పించారు. ఇప్పుడు SIFWA ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. గతంలో విజయ్ కోసం చిన్నసామి ఈ స్క్రిప్ట్ రాశాడట. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ కోసం పని చేసారు. అతని స్క్రిప్ట్ ఇప్పుడు శంకర్ చేతిలో తనకు తెలియకుండానే వచ్చిందని ఆరోపించారు. రచయిత సంఘం ప్రస్తుతం రెండు స్క్రిప్ట్‌లను పరిశీలిస్తోంది.
మరోవైపు శంకర్ తదుపరి భారీ బడ్జెట్ చిత్రం “ఇండియన్ 2” అనేక కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. శంకర్ ఇటీవల రణ్‌వీర్ సింగ్‌తో “అన్నీయన్” రీమేక్‌ను ప్రకటించాడు. సినిమా అసలు నిర్మాత ఎస్ థాను రీమేక్ హక్కులను తాను సొంతం చేసుకున్నానని, తన అనుమతి లేకుండా రీమేక్ ప్రకటించినట్లు మండిపడడం చర్చనీయాంశమైంది.