టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా విడులై పాజిటివ్ టాక్ దిశగా ముందుకెళ్తుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించిన రావణాసుర సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దానికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
సుధీర్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్ పతాకాలపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్30న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
𝑴𝒂𝒔𝒔 𝑴𝒂𝒉𝒂𝑹𝒂𝒋𝒂 @RaviTeja_offl #Ravanasura SECOND SCHEDULE WRAPPED #RAVANUSURA @iamSushanthA @sudheerkvarma @SrikanthVissa @RTTeamWorks @ItsAnuEmmanuel @akash_megha @fariaabdullah2 @DakshaOfficial @rameemusic @KiranDrk @KVijayKartik #RavanasuraOnSep30 pic.twitter.com/z9Kvcdza9A
— ABHISHEK PICTURES (@AbhishekPicture) February 12, 2022