టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. డిస్కోరాజా నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలేనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే గతంలో ‘డాన్‌శీను, బలుపు’ వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో రవితేజ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాపై రవితేజ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇందులో రవితేజ పక్కన శృతి హాసన్ రొమాన్స్ చేయబోతుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ నెగటివ్ రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆ పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో మీసం తిప్పుతున్న రవితేజ మాస్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
రవితేజ వేసుకున్న పోలీస్ డ్రెస్ పై ‘పి. వీర శంకర్’ అనే పేరు కనిపిస్తుంది. దాంతో క్రాక్ లో తమ హీరో పేరు అదే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఒక షెడ్యూల్ మినహా చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఓ పాటను విడుదల చేయబోతున్నారట. కరోనా కారణంగా థియేటర్స్ ఇంకా తెరుచుకోకపోవడంతో క్రాక్ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమా నిర్మాత బి. మధు కొన్ని ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.