రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రవితేజా?


టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 60 సినిమా పూర్తయింది. తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక వస్తవ కథను తీసుకొని సినిమా చేస్తున్నాడు డైరెక్టర్‌.

ఇక ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలోని సెంట్రల్ జైలు లో జరుగుతుంది. రవితేజా పై కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 4నుండి జర్మనీలో పలు అందమైన ప్రదేశాల్లో రెండు పాటల్నీ చిత్రీకరించడానికి వెళ్లనుంది చిత్రబృందం. ఆ తర్వాత హైదరాబాద్ సారధి స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో మరో మాస్ పాటను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu