గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్లో మూడోచిత్రం క్రాక్. ఈసినిమా ఇవాళ ఉదయం రిలీజ్ కావాల్సింది. ఫైనాన్షియల్ కారణాలతో సినిమా విడుదల నిలిచిపోయింది. దీంతో రోజుల తర్వాత థియేటర్లో అభిమాన హీరో సినిమా చూద్దామనుకున్నవారికి నిరాశ ఎదురైంది. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఉదయమే థియేటర్లకు వచ్చి నిరాశతో
వెనుదిరిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం థియేటర్లలో క్రాక్ విడుదలకు సన్నాహాలు చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలకు మంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం క్రాక్ సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో సాయంత్రానికి బొమ్మ విడుదలైనట్లు దర్శకుడు ట్వీట్ చేశాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ నటించిన క్రాక్పై భారీ అంచనాలున్నాయి. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ కాగా, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శ్రుతిహాసన్ టాలీవుడ్లో నటించింది. ఇందులో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని విలన్గా నటించారు.
All problems solved for #Krack release. 🔥🔥👍👍
Let's get Krackified from today's first shows. 💥
Watch it now in your nearest theaters!! pic.twitter.com/50y8HzFLqR— Gopichandh Malineni (@megopichand) January 9, 2021