మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన చిరంజీవి లుక్ ఆకట్టుకుంది. తాజగా రవితేజ తన లుక్ గురించి అదిరిపోయే అప్‌డేట్ అందించారు .
మీరంతా అప్‌డేట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీ అందరికీ నాలో ఉన్న కొత్త వ్యక్తిని డిసెంబర్ 12న ఉదయం 11:07 గంటలకు పరిచయం చేస్తున్నా.. అని ట్వీట్ చేశారు. సిలిండర్‌ను గొడ్డలితో లాక్కెళ్తూ ఉన్న స్టిల్‌ను షేర్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు.
వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.