HomeOTTRaviteja: మిస్టర్ బచ్చన్ విడుదలకి ముందు ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా

Raviteja: మిస్టర్ బచ్చన్ విడుదలకి ముందు ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా

Raviteja Eagle streaming on this OTT platform
Raviteja Eagle streaming on this OTT platform

Raviteja Eagle OTT:

మాస్ మహారాజా రవితేజ అభిమానులు అందరూ.. మిస్టర్ బచ్చన్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. హిందీలో సూపర్ హిట్ అయిన రెయిడ్ సినిమాకి తెలుగు రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. రవితేజ నటించిన మరొక సినిమా సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది.

అదే ఈగల్ సినిమా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో సినిమాని చూడని వాళ్ళు.. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసేయొచ్చు.

నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. హిందీలో కూడా ఈ సినిమా విడుదలైంది కానీ.. అదే ఫలితాన్ని అందుకుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా కనిపించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన డబల్ ఇస్మార్ట్ శంకర్ కూడా మిస్టర్ బచ్చన్ తో పాటే ఆగస్టు 15న విడుదల కాబోతోంది. నిన్న మొన్నటిదాకా వరుస డిజాస్టర్లు అందుకున్న రవితేజ.. మిస్టర్ బచ్చన్ సినిమాతో అయినా.. మంచి హిట్ అందుకుంటే బాగుంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu