Raviteja Anudeep Movie:
గత కొంతకాలంగా మాస్ మహారాజా రవితేజ వరుసగా ఫ్లాప్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. రవితేజ కి ఇప్పటికైనా ఒక మంచి హిట్ పడాలి అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రవి తేజ కూడా ఈసారి మంచి హిట్ అందుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు.
కొన్ని రోజులు కమర్షియల్ సినిమాలు కాకుండా మంచి కంటెంట్ ఉన్న కథలు ఓకే చేయాలి అని యంగ్ డైరెక్టర్ లు చెప్పే కథలు విన్నారు. ఈ నేపథ్యంలోనే జాతిరత్నాలు, ప్రిన్స్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న అనుదీప్ కేవీ రవితేజకు ఒక మంచి రొమాంటిక్ కామెడీ కథను వినిపించారు. రవితేజ కూడా ఆ కథపై ఆసక్తి చూపించారు.
లైన్ బాగా నచ్చడంతో వెంటనే అనుదీప్‌కి పూర్తి స్క్రిప్ట్ తీసుకుని రమ్మని సూచించారు. ఈ సినిమాపై ఆశలు కూడా పెట్టుకున్నారు. ఫ్యాన్స్ కి కూడా వీళ్ళిద్దరి కాంబో పై మంచి అంచనాలే ఉన్నాయి.
Raviteja Anudeep Movie:
అనుకున్నట్టుగానే అనుదీప్ తన స్క్రిప్ట్‌ను పూర్తిచేశారు. రవితేజ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించారు. కానీ అక్కడే ట్విస్ట్ వచ్చింది. కథ మొత్తం విన్న మాస్ మహారాజా సినిమాని హోల్డ్ లో పెట్టేసారట. అనుదీప్ చెప్పిన కథ లో రెండవ హాఫ్ నచ్చలేదు అని రవితేజ సినిమాని క్యాన్సిల్ చేశారట. ఈ రకంగా రవితేజ – అనుదీప్ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.
ప్రస్తుతం రవితేజ భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో కూడా రవితేజ ప్రేక్షకులను పలకరించనున్నారు. అంతే కాకుండా రవి తేజ RT75 సినిమాలో కూడా నటిస్తున్నారు. మరి ఈ సినిమాలతో రవితేజ ఎంత వరకు మంచి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, అనుదీప్ ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రంలో ఒక చిన్న క్యామియో పాత్ర లో కనిపించారు. అనుదీప్ దర్శకత్వం వహించనున్న నెక్స్ట్ సినిమాల మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.