సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆయన తదుపరి సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ -మహేశ్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్గా తీసుకున్నారు. విలన్గా తారకరత్న చేయడం దాదాపు ఫిక్స్ అయిపోయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ సీనియర్ స్టార్ రవిచంద్రన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కన్నడలో ఆయనకి క్రేజీ స్టార్ అనే బిరుదు వుంది.
గతంలో ఆయన సినిమాలు తెలుగులోను విడుదలయ్యేవి. అయితే ఈ జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు ఆయన అంతగా తెలియదు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఉపేంద్ర మాదిరిగా ఈ సినిమాలో రవిచంద్రన్ కి మంచి రోల్ పడినట్టుగా సమాచారం. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో నిలబెట్టాలని ఉద్దేశంతో ఆ దిశగానే పనులు మొదలెట్టారు.