మాస్ మహారాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం నిర్మితమవుతుంది. ఈ సినిమాలో రవితేజ తనయుడు మహాధన్ తెరంగేట్రం చేయనుండటం విశేషం. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాను అక్టోబర్ రెండో వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తన్నారు. ఈ సందర్భంగా…
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “పటాస్, సుప్రీమ్ చిత్రాల తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న మరో కమర్షియల్ ఎంటర్టైనర్ రాజా ది గ్రేట్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న సినిమాలో మాస్ మహారాజా రవితేజగారు ఇప్పటి వరకు చూడని అంధుడి పాత్రలో కనపడనున్నారు. అల్రెడి విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు విషయమేమంటే, ఈ చిత్రంలో రవితేజగారి తనయుడు మహాధన్ నటిస్తున్నాడు. కథలో భాగంగా రవితేజగారి చిన్నప్పటి పాత్రలో ఎవరు నటిస్తే బావుంటుందనే దానిపై చాలా ఆలోచించాం. చివరకు ఆ పాత్రకు మహాధన్ అయితే సరిపోతాడనిపించి రవితేజగారిని అడిగాం. ఆయన కూడా సరేనన్నారు. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. అక్టోబర్ రెండో వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.