టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నాడు. లాక్‌డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని కొత్త కథలు వినడానికి వినియోగించుకుంటున్నాడు. కొత్త, పాత డైరెక్టర్‌లు ఆయనకు కథలు వినిపిస్తున్నారు. వీటిలో కొన్ని కథలు ఆయనకు బాగా నచ్చడంతో.. నాలుగైదు కొత్త ప్రాజక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవన్నీ కూడా వన్ బై వన్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రవితేజ.
ఈ క్రమంలో రమేష్ వర్మ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రవితేజ ఓకే చెప్పాడు. ఇందులో ఆయన రెండు వెరైటీ పాత్రలు పోషిస్తూ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాశిఖన్నా, నిధి అగర్వాల్ లను హీరోయిన్‌లుగా ఎంపిక చేశారు. ఇక ఈ చిత్రానికి ‘కిలాడి’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ టైటిల్ రవితేజకు కూడా బాగా నచ్చడంతో దీనినే ఫైనల్ చేసే అవకాశం వుంది. కాగా రవితేజ ‘క్రాక్’ సినిమాతో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.