Ravi Teja Sreeleela Movie: మాస్ మహారాజా రవితేజ కి ధమాకా, వాల్తేరు వీరయ్య తరువాత ఒక హిట్ కూడా కొట్టలేదు. వరుసగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో రవితేజ నెక్స్ట్ సినిమాల మీదే అభిమానులు సైతం ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ అదే రోజున ఎన్టీఆర్ దేవర సినిమా విడుదలవుతుంది అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని అభిమానులు ఆల్రెడీ కంగారులో ఉన్నారు.
మరోవైపు రవితేజ చేతిలో భాను భోగవరపు దర్శకత్వంలో మరొక సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇది ఒక పీరియాడిక్ సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి భాను భోగవరపు రవితేజ తో పిరియాడిక్ సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యారట.
కథను నెరేట్ చేసి రవితేజని ఒప్పించాక ముగ్గురు నలుగురు నిర్మాతలను కూడా వినిపించారట. కానీ అందులో ఒకరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అదే సమయంలో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చారు.
అయితే రవితేజ కి ఇది మొదటి పీరియాడిక్ సినిమా కాదు. గతంలో చేసిన డిస్కో రాజా, ఈ మధ్యనే వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా పీరియాడిక్ సినిమాలే. కానీ అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అలాంటిది మరొకసారి రవితేజ రిస్క్ చేస్తున్నాడా అని అభిమానులు కంగారుపడుతున్నారు.
పైగా అసలే హిట్ సినిమా కొట్టి చాలాకాలం అయిపోతుంది అనుకుంటూ ఉండగా.. ఇలాంటి సమయంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడని.. అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.