మాస్ మహాతేజ రవితేజ వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. అలా రవితేజ మరో కొత్త దర్శకుడు శరత్ మండవతో సినిమా ప్రారంభించారు. రచయితగా మంచి అనుభవమున్న శరత్ కి దర్శకుడిగా ఇది తొలి సినిమా. ‘ఉగాది’ పండుగను పురస్కరించుకుని, ఈ సినిమా కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కరోనా తీవ్రత కారణంగా చాలా సింపుల్ గా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
దేవుడి చిత్రపటాలపై రవితేజ క్లాప్ ఇవ్వగా, ఈ సినిమా షూటింగును లాంఛనంగా ప్రారంభించారు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, సత్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. ‘దివ్యాన్ష కౌశిక్’ ఈ సినిమాలో హీరోయిన్గా అలరించనుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలుకానుంది.