మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. హావీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ మరియు అనసూయ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇటలీలో షూటింగ్ జరుగుతున్న ఖిలాడి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి మాస్ మహారాజ అభిమానులతో పాటు కామన్ ఫ్యాన్స్‌కి భారీ సర్‌ప్రైజ్ రాబోతోంది. ఖిలాడి టీజర్ ఈనెల 12న ఉదయం 10గం.08 నిముషాలకి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
#Khiladi 😎 pic.twitter.com/qpgw5031Ao
— Ravi Teja (@RaviTeja_offl) April 9, 2021