HomeTelugu Trendingచిరంజీవి సినిమాలో రవితేజ!

చిరంజీవి సినిమాలో రవితేజ!

Ravi teja in chiranjeevi mo

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్నతాజా చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుద‌ల‌కు రెడీగా ఉంది. ఈ సినిమా పూర్తి కావడంతో.. చిరంజీవి.. గాడ్ ఫాద‌ర్ షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లు పెట్టాడు. త్వ‌ర‌లో భోళా శంక‌ర్, బాబీ మూవీల షూటింగ్ ప్రారంభించ‌నున్నాడు. అయితే చిరు సినిమాల‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా బాబీ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మెగాస్టార్ 154వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాగా వస్తుండ‌గా, ఇందులో మాస్ మహారాజ్ రవితేజ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ఓ బ‌ల‌మైన పాత్ర‌కు ర‌వితేజ అయితే సరిగ్గా స‌రిపోతాడ‌ని భావించి బాబీ.. మాస్‌రాజాని సంప్రదించగా.. ఆయ‌న వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.

ర‌వితేజ న‌టించిన ఖిలాడి చిత్రం ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం రవితేజ ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్‌డ్యూటీ’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu