HomeTelugu Trendingమహేష్‌, బన్నీలకు పోటీగా రవితేజ?

మహేష్‌, బన్నీలకు పోటీగా రవితేజ?

 

Ravi Teja entered in busine
మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోహీరోయిన్‌లు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్‌లో కూడా తమ సత్తా చాటుతున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపారరంగంలోనూ రణిస్తున్నారు.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. అదే విధంగా ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఏఎంబి సినిమాస్ ప్రస్తుతం అద్భుతంగా నడుస్తుంది.

మరో వైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏఏఏ సినిమాస్ అంటూ మల్టిఫ్లెక్స్ ని ప్రారంభించారు. గత ఏడాది ఈ మల్టిఫ్లెక్స్ ప్రారంభం అయింది. తాజాగా ఇదే బాటలో మాస్ మహారాజ్ రవితేజ చేరిపోయారు. వీరిద్దరికీ పోటీగా రవితేజ మల్టీఫ్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నారా అని టాక్‌.

తాజా సమాచారం మేరకు రవితేజ నటిస్తున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో దిల్ షుక్ నగర్ లో భారీ మల్టీ ఫ్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 6 స్క్రీన్స్ ఉన్న మల్టీ ఫ్లెక్స్ ని నిర్మిస్తున్నారట. ఈ మల్టీ ఫ్లెక్స్ కి ART ఏఆర్టి అని నామకరణం కూడా చేబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ధమాకా తర్వాత ఈ మాస్ మహారాజ్ కి సరైన హిట్ లేదు. ఇటీవలే ‘ఈగల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకులేపోయింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu