Eagle Twitter Review: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈగల్’. భారీ హోప్స్‌తో సినిమా ఈరోజు (ఫిబ్రవరి9)న థియేటర్లోకి వచ్చింది. ఈక్రమంలో ట్విట్టర్ వేదికగా సినిమా బ్లాక్ బస్టర్ అని రిపోర్టులు వస్తున్నాయి. ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోన్నట్టుగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈగల్ రెండో పార్ట్ యుద్దకాండ అని కూడా ఉంది అంటున్నారు. అంటే ఈగల్ సీక్వెల్ కూడా రెడీ అని టాక్.
ఈ సినిమా రవితేజకు కమ్‌బ్యాక్ మూవీ అని అంటున్నారు. లాస్ట్ 40 మినిట్స్ ఈ మూవీ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌కు థియేటర్లు బ్లాస్ట్ అవడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సహదేవ వర్మ పాత్రలో రవితేజ యాక్టింగ్, మేనరిజమ్స్ ఈగల్ మూవీలో కొత్తగా ఉన్నాయని అంటున్నారు.
ఈ సినిమాలో చాలా మాసీ సీన్లున్నాయని, బీ సీ సెంటర్లు పిచ్చెక్కిపోయే షాట్స్ ఎన్నో ఉన్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. అమ్మవారి హ్యాండ్స్ నుంచి గన్ జారడం, యాక్షన్ సీక్వెన్స్‌లో గన్నుతో సిగరెట్‌ను వెలిగించుకోవడం ఈ సీన్లన్నీ ఇంకా మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. . ఈగల్‌కు సెకండ్ పార్ట్ కూడా ఉండబోతున్నట్లు క్లైమాక్స్‌లో రివీల్ చేశారని అంటున్నారు.
ఇదో యాక్షన్ డ్రామా.. ఫుల్ స్టైలీష్‌గా ఉంది.. కానీ అనుకున్నంతగా విషయం లేదు.. అనవసరమైన ఎలివేషన్లు ఎక్కువగా ఉన్నాయి. ఎమోషనల్ పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. రవితేజ బెస్ట్ మేకోవర్.. టాప్ నాచ్ విజువల్స్ కోసం సినిమా చూడాల్సిందే. ఆధునిక వేట.. కానీ అదుపు తప్పిన కథ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రవితేజలాంటి ఓ ఎనర్జిటిక్ యాక్టర్.. కార్తీక్ ఘట్టమనేని లాంటి ఓ దర్శకుడు కలిస్తే ఈ సినిమా ‘ఈగల్’లానే ఉంటుంది.. ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది.. బిగ్ స్క్రీన్ మీద విస్పోటనం జరిగింది.
స్టార్టింగ్‌లో రిలాక్స్‌గా కూర్చునే ప్రేక్షకుడు ఆ తరువాత క్షణక్షణం ఉత్కంఠలా ఫీల్ అవుతాడు. కథ రొటీన్‌గా ఉన్న.. థ్రిల్‌ని ఇస్తుంది. ఈ కథను ప్రజెంట్ చేసే విధానం బాగుంది. చివర్లో స్టైలీష్ బీజీఏం అదిరిపోయింది. ప్రతీ యాక్షన్ సీన్ తరువాత ఓ ఈగల్ షాట్‌లాంటి డ్రోన్ షాట్ పెడతాడు. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా ఆ షాట్లుంటాయి.
డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అనుపమ ఈ సినిమాలో తన నటనతో ఆడియెన్స్ కట్టి పడేస్తుంది. అందరి పాత్రలు బాగున్నాయి. అయితే కొందరికి మాత్రం ఈ సినిమా నచ్చలేదనిపిస్తుంది. వరస్ట్ అని చెప్పేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ చిత్రానికి సంబంధించిన అసలు మ్యాటర్ గురించి తెలియాలంటే.. పూర్తి రివ్యూ రావాల్సిందే.