టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు కొత్త డైరెక్టర్ శరత్ మండవతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవితేజ ఈ చిత్రంలో ప్రభుత్వ అధికారిగా కనిపించబోతన్నాడట.
రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో పాటు పలు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో చూసాం. ఈ సారి మాత్రం రూట్ మార్చి.. నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా కనిపించబతున్నాడని టాలీవుడ్ టాక్. ఈ మూవీకి రవితేజ రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసకుంటున్నట్టు సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో మజిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.