మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2021 ప్రారంభంలో “క్రాక్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ అదే ఉత్సాహంతో దుసుకూపోతున్నారు. ప్రస్తుతం రవితేజ ఖాతాలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు రవితేజ.
మాస్ మహారాజా గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈరోజు రవితేజ సోషల్ మీడియా వేదికగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. రవితేజ 71వ చిత్రంగా “టైగర్ నాగేశ్వర రావు”రూపొందనుంది. ఈ మేరకు ప్రీ లుక్ ను రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కాగా రవితేజ కెరీర్‌లో ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఈ భారీ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. హిందీలో కూడా విడుదల కానున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ హిందీ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతరవివరాలు త్వరలో ప్రకటించనున్నారు.