మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’. సుదీర్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 7 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన మూవీ అప్‌డేట్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రావణాసుర అనే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ తో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో రవితేజ కనిపిస్తున్నాడు అనే చెప్పకనే చెప్పారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఎప్పటిలాగే.. తన కామెడీ టైమింగ్ తో రవితేజ అదరగొట్టాడు.
తరువాత యాక్షన్ మోడ్ స్టార్ట్ చేసి మరల ఒక్కసారిగా వేరియేషన్ చూపించారు. లాయర్ పాత్రలో రవితేజని రిప్రజెంట్ చేశారు. వాడు క్రిమినల్ లాయర్ కాదు ‘లా చదివిన క్రిమినల్ అంటూ జయరామ్ క్యారెక్టర్ తో రవితేజ ఒరిజినాలిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక ఆ క్యారెక్టర్ తో రొమాంటిక్ యాంగిల్ ని ఆవిష్కరించారు. అందులో అనూ ఇమ్మాన్యుయేల్, ఫైరా అబ్దులా, మేఘా ఆకాష్ క్యారెక్టర్స్ చుట్టూ కొన్ని ఎలిమెంట్స్ నడిపించాడు.
పోలీసులకి సవాల్ విసిరే ఓ క్రిమినల్ గా రవితేజ పాత్ర ఈ మూవీలో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రావు రమేష్, సుశాంత్, జయరామ్, కీలక పాత్రల్లో నటించారు. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు