కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాయో తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఎన్నోరకాల చర్యలను చేపట్టింది. ప్రపంచానికి పెను ముప్పుగా మారిన కరోనాను ఎదుర్కొనడానికి ప్రపంచ దేశాలకు వ్యాపార వేత్తలు సైతం సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే భారతీయ వ్యాపార వేత్త రతన్ టాటా ముందుకు వచ్చారు. కరొనాను ఎదుర్కొనడానికి తన వంతు సహాయంగా రూ.500 కోట్ల రూపాయలు సహాయం అందించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు.
ఈ కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల్లోని సుమారు 300 కోట్ల మంది బాధపడుతున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 933 కరోనా కేసులు నమోదు కాగా, ఈ వైరస్‌తో 20 మంది మృతిచెందారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా రెండో దశలో ఉన్నది. మూడో దశకు వెళ్ళకుండా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కరోనాను కట్టడి చేయాలని ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి.