టాలీవుడ్‌లో ‘గీత గోవిందం’ సినిమాతో బ్యూటీఫుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ అవార్డుల వేడుకలో ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరి ర్యాంప్ వాక్ చూసి అభిమానులు మరోసారి వీరి జంటకు ఫిదా అయిపోయారు.
ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా దక్షిణాది భాషల్లో మంచి ప్రతిభను కనబరిచిన పలువురు నటీనటులకు, టెక్నీషియన్స్‌కు ‘బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్’ అందించారు. ఇందులో భాగంగా తెలుగులో ఉత్తమ నటి(విమర్శకుల ఛాయిస్)గా రష్మిక అవార్డును గెలుపొందారు. అందుకుగాను విజయ్ దేవరకొండ ఆమెకు గోల్డ్ మెడల్‌ను బహూకరించారు. అనంతరం రష్మిక మాట్లాడుతూ.. ‘జీవితంలో ఇదే నా మొదటి గోల్డ్ మెడల్. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో పోషించిన లిల్లీ పాత్ర ఎంతో కీలకమైనది. ఆ పాత్ర కోసం నేనెంతో కష్టపడ్డాను. థ్యాంక్యూ విజయ్ అవార్డు ఇచ్చినందుకు. అలాగే నువ్వు చాలా మంచి కోస్టార్.’ అని రష్మిక చెప్పారు.
అనంతరం వ్యాఖ్యాత ‘గీతగోవిందం’ చిత్రంలోని ఓపాటలో రష్మిక.. విజయ్‌ను ఇమిటేట్ చేస్తున్నట్లు ఉన్న వాక్‌ను చేయమని కోరగా వీరిద్దరు స్టేజ్‌పై చేశారు. అలా రష్మిక – విజయ్ ‘ఏంటి ఏంటి ఏంటి’ సాంగ్‌లోని ఓ సీన్‌ను మరోసారి రీక్రియేట్ చేశారు. దీంతో అక్కడ ఉన్న అభిమానులు ఫిదా అయి ఈలలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.