స్టాలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత మరో సినిమా చేయటానికి చాలా విరామం తీసుకున్నాడు. వరసగా హిట్స్ కొడుతూ వచ్చిన బన్నీకి నాపేరు సూర్య బ్రేక్ వేసింది. మరో బ్రేక్ ఉండకూడదని..మరలా హిట్స్ తో దూసుకుపోవాలని బన్నీ ఉవ్వీళ్ళూరుతున్నాడు. ఆలస్యమైనా సరే సినిమా చేస్తే హిట్ కొట్టాల్సిందే అని అంటున్నాడు ఈ యంగ్ హీరో.
తన కెరీర్లో రెండు బెస్ట్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్సకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. కథతో పాటు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడు త్రివిక్రమ్. మాములుగా ఫిబ్రవరి 14 వ తేదీన సినిమా ఓపెనింగ్ కావలసి ఉంది. కొన్ని కారణాల వలన సినిమా ఓపెనింగ్ ను పోస్ట్ ఫోన్ చేశారు. ఈ నెలాఖరు లేదంటే మార్చి మొదటి వారంలోను సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ, రష్మిక మందన పేర్లు వినిపించినా.. చివరకు రష్మిక వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. తెలుగులో వరసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న ఈ కన్నడ బ్యూటీకి ఇది భారీ అవకాశమనే చెప్పాలి. బన్నీతో చేసే సినిమా హిట్టయితే.. మెగా కాంపౌండ్ నుంచి వరసగా అవకాశాలు వస్తాయి.