HomeTelugu Trendingచుప్‌..ఆపండెహే.. సుల్తాన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మిక

చుప్‌..ఆపండెహే.. సుల్తాన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మిక

Sultan Movie Pre Release Event 1
టాలీవుడ్‌ ఛలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం కార్తీ హీరోగా ‘సుల్తాన్‌’ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మిక తన మాటలతో సందడి చేసింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్‌ని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ‘కరోనా ఎలా ఉంది? అందరూ మాస్క్‌లు పెట్టుకున్నారా..నాకేం కనిపించట్లేదు జాగ్రత్తలు పాటించి థియేటర్‌కి వచ్చి సినిమాను చూడండి’ అని రష్మిక తెలిపింది.

ఈ సందర్భంగా ఒక్కసారిగా సూర్య..సూర్య అని అభిమానులు గోల చేస్తూ ఆమెను మాట్లాడకుండా చేశారు. దీంతో రష్మిక సైతం సూర్య.. కార్తీ అని అరుస్తూ… ‘చుప్‌..ఆపండెహే. నన్ను మాట్లాడనివ్వండి. నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది.. ప్లీజ్ రా మాట్లాడనీయండ్రా’ అని ముద్దుముద్దు మాటలతో ఫ్యాన్స్‌ని బతిమాలింది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చిన వంశీ పైడిపల్లికి కృతఙ్ఞతలు చెప్పిన రష్మిక..మహర్షి మూవీకి జాతీయ అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్‌ చెబుతూ..తనకు పార్టీ కావాలని అడిగింది.

ఇక కోలీవుడ్‌లో తాను డెబ్యూగా నటించిన సుల్తాన్‌ సినిమాను హిట్‌ చేయాలని, ఇదే నాకు మీరిచ్చే బర్త్‌డే గిఫ్ట్‌ అని ఫ్యాన్స్‌ను కోరింది. సాధారణంగా స్టేజ్‌పై మాట్లాడాలంటే పెద్ద హీరోలు సైతం తడబడుతుంటారు. కానీ రష్మిక స్టైలే డిఫరెంట్‌ అంటూ అభిమానులు ఫిదా అవుతుంటే, మరోవైపు ప్రతీసారి స్టేజ్‌పై రష్మిక ఓవరాక్షన్‌ను తట్టుకోలేకపోతున్నాం…కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu