రష్మిక మందన్నాకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలసిందే. ఈ వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ డీప్‌ఫేక్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరలవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక స్పందించారు. ఈ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు.
ఈ మేరకు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి రావడం చాలా బాధ కలిగిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం భయానకంగా అనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం కారణంగా ఇలాంటి పరిస్థితి నాకే కాదు.. ప్రతి ఒక్కరికీ పొంచి ఉంది. ఈరోజు ఒక మహిళగా, నటిగా, నాకు రక్షణగా, మద్దతుగా ఉన్న నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నా శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితే నేను స్కూల్లోనో, కాలేజ్ లోనో చదువుకుంటున్నప్పుడు ఎదురైతే నేను ఏం చేయగలనన్నది ఊహకందని విషయం. అందుకే, ఇలాంటి విషయాలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మరెంతో మంది ఈ డీప్ ఫేక్ వీడియోల బారినపడకుండా రక్షించాలి’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కొందరు ఆకతాయిలు ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రష్మిక ఏంటి.. ఇలా తయారైంది అంటూ మాట్లాడుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఒరిజినల్ వీడియో, రష్మిక డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
🚨 There is an urgent need for a legal and regulatory framework to deal with deepfake in India.
You might have seen this viral video of actress Rashmika Mandanna on Instagram. But wait, this is a deepfake video of Zara Patel.
This thread contains the actual video. (1/3) pic.twitter.com/SidP1Xa4sT
— Abhishek (@AbhishekSay) November 5, 2023