నటి ఐశ్వర్య రాజేష్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల హీరోయిన్ రష్మిక మందన్న స్పందించింది. పుష్ప సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర విషయంలో ఐశ్వర్య రాజేష్ తన అభిప్రాయాలను వెల్లడించగా, వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆమె వివరణ ఇచ్చింది. వాస్తవంగా ఆమె ఏం మాట్లాడానన్న వివరణతో ఐశ్వర్య ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆ పాత్రలో రష్మిక కంటే తాను బాగా చేసి ఉండనని ఐశ్వర్య రాజేష్ స్పష్టం చేసింది. కాకపోతే అలాంటి పాత్ర తనకు నప్పుతుందని చెప్పానంటూ స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్టు పేర్కొంది. రష్మిక పాత్ర పట్ల తనకు ఎంతో అభిమానం తప్పించి మరోటి లేదన్నారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ‘తెలుగు సినిమాలో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?’ అని నన్ను ప్రశ్నించారు. తెలుగు పరిశ్రమ అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పా. నాకు నచ్చే పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానన్నాను. పుష్ప సినిమాలో శ్రీవల్లి తరహా పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాంటి పాత్రలు తనకు సరిపోతాయని ఉదాహరణగా చెప్పాను. కానీ నా మాటలను తప్పు అర్థం వచ్చేలా రాశారు. పుష్పా సినిమాలో రష్మిక చేసిన అద్భుతమైన నటనను నేనేదో కించపరిచినట్టు చూపించారు’ అంటూ ఐశ్వర్య రాజేష్ వివరణ ఇచ్చింది.
దీనిపై రష్మిక మందన్న స్పందిస్తూ.. ‘హాయ్ లవ్.. నీవు ఏం చెప్పావో నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. దీనికి వివరణ ఇచ్చుకోల్సిన అవసరం లేదు. నీవంటే నాకు ప్రేమ, గౌవరం ఉన్నాయనేది నీకు తెలుసు’ అని రష్మిక పేర్కొంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు