మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తాజా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో చిరంజీవికు జంటగా కాజల్ ను తీసుకున్నారు. ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది కూడా. ఇక ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా సమంత చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత కైరా అద్వాని డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.
తాజాగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. చరణ్ జోడీగా రష్మికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఒక వైపున సుకుమార్ సినిమాలో బన్నీ సరసన నటించడానికి రష్మిక సెట్స్ పైకి వెళ్లనుంది. మరో వైపున చరణ్ జోడీగా అలరించడానికి కూడా ఆమె సిద్ధమవుతోందన్న మాట. మెగా హీరోలిద్దరి సినిమాల్లోను ఒకేసారి ఛాన్స్ కొట్టేసినప్పుడు, రష్మికను అదృష్టవంతురాలని కాక మరేమంటారు?