మెగా అభిమానులు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో చేయనున్న సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటించినప్పటి దగ్గర నుంచి, ఈ మూవీ అప్‌డేట్స్ తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ ఎవర్ని తీసుకుంటారో అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఆల్రెడీ ఆమెకి కథను వినిపించడం జరిగిపోయిందని అంటున్నారు.
నిజానికి రష్మిక చాలా బిజీగా ఉంది. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో నెంబర్ వన్ ప్లేస్ కి ఆమె ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇక శంకర్ కథ చెప్పకున్నా ఓకే చెప్పేసే స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. చరణ్ జోడిగా అంటే తమ పాత్ర గురించి పట్టించుకోని హీరోయిన్లు ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.