![Bigg Boss 8 Telugu ఇంట్లో ఉన్న రష్మిక మందన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?! 1 Bigg Boss 8 Telugu, Bigg Boss 8 Telugu Contestant](https://www.klapboardpost.com/wp-content/uploads/2024/09/New-Project-53-2.jpg)
Bigg Boss 8 Telugu Contestants:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లో ప్రేరణ కంబం ఒకరు. కన్నడ సీరియల్స్ లో ఎక్కువగా కనిపించే ఈమె తెలుగులో కూడా పాపులర్. నిజానికి ఈమె పుట్టింది హైదరాబాద్ లోనే. కానీ పెరిగింది మాత్రం బెంగుళూరులో. అక్కడే మోడలింగ్ కూడా మొదలు పెట్టింది. 2017లో హర హర మహదేవ అనే కన్నడ సీరియల్ తో ఆమె బుల్లి తెరకు పరిచయమయ్యింది.
2018లో సురకత్తె టైటిల్ తో విడుదలైన ఒక కన్నడ సినిమాలో కూడా ఈమె నటించింది. ఫిజిక్స్ టీచర్ అనే మరో చిత్రంలో ప్రేరణ కీలక పాత్రలో కనిపించింది. కృష్ణా ముకుందా మురారి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది కానీ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. ఈ సీరియల్ లో హిరోయిన్ గా చేసిన యష్మి గౌడ, ప్రేరణ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్ట్ చేస్తున్నారు.
అయితే బిగ్ బాస్ ప్రేరణకు కొత్త కాదు. 2021లో కన్నడ బిగ్ బాస్ కన్నడలో ఆమె కొద్ది రోజులు పాల్గొన్నారు. అయితే ప్రేరణకు రష్మిక మందన్న బెస్ట్ ఫ్రెండ్ అని సమాచారం. వీరిద్దరూ ఒకప్పుడు ఒకే రూమ్ లో కలిసి ఉండేవారట. ఇద్దరూ కలిసి చాలానే క్రేజీ పనులు చేశారట. అర్ధరాత్రి 2 గంటలకు స్కూటీ వేసుకుని రోడ్లపై చక్కర్లు కూడా కొట్టేవారట.
Read More: Bigg Boss Telugu 8 ఇంట్లోకి కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో తెలుసా?
కానీ ఇప్పుడు రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా బిజీ అయిపోవడంతో ప్రేరణతో పెద్దగా కలవడం లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రేరణకు ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. ఆమె భర్త పేరు శ్రీపాద్ దేశ్ పాండే. వీరిద్దరూ చాలా కాలం రహస్యంగా ప్రేమించుకుని ఇరు కుటుంబాల పెద్దలను చాలా కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకున్నారట.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ చాలామందితో పోలిస్తే బాగానే ఆకట్టుకుంటుంది. ఇంట్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ లలో ఈమె కూడా ఒకరు అని చెప్పొచ్చు. ఈ వారం నామినేషన్ లిస్ట్ లో విష్ణుప్రియ, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నిఖిల్, సీత, నైనిక, పృథ్విరాజ్, ఆదిత్య ఓం ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో వేచి చూడాలి.