టాలీవుడ్ లో ‘ఛలో’ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మిక మందన్న అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవలే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ… పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
మీరు డేటింగ్ కు వెళ్లాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ… టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తనకు అవకాశం వస్తే.. ఏదో ఒకరోజు డేట్ కు వెళ్తానని రష్మిక తెలిపింది. ప్రభాస్ కు తాను పెద్ద అభిమానిని అని చెప్పింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది.