రష్మిక మందన్న ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టింది. ఆ తరువాత ఈ అమ్మడు విజయ్ దేవరకొండతో గీత గోవిందం చేసింది… ఈ సినిమా వంద కోట్ల రూపాయలు వసూలు చేయడంతో… విజయ్ తో పాటు రష్మికకు మంచి పేరు వచ్చింది. లక్కీ హీరోయిన్ గా మారిపోవడంతో… విజయ్ చేస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలోనూ చేస్తోంది. డియర్ కామ్రేడ్ షూటింగ్ దాదాపు కంప్లీట్ కావొచ్చింది.
దీనితో పాటు ఈ అమ్మడు నితిన్ సినిమాలోనూ నటిస్తోంది. అంతేకాదు, టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు సినిమాలో కూడా హీరోయిన్ గా సెట్ అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేయబోతున్న కొత్త చిత్రంలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కబోతున్నది. జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.