టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రష్మిక మందన్న మరో టాప్ క్లాస్ అవకాశాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా తెరకెక్కబోతున్న నాలుగో సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. చాలా కాలం నుంచి అఖిల్ కు జోడిగా రష్మిక అని అనుకుంటున్నారు. ఆ గాసిప్స్ కు తెరదించుతూ ఆమెను సినిమాలో తీసుకోవడానికి ఒకే చేశారు.
గీత ఆర్ట్స్ పతాకంపై బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. మొదట ఈచిత్రానికి దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నా.. బడ్జెట్ ను తగ్గించడం కారణంగా గోపి సుందర్ ను తీసుకున్నారట. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడా చూద్దాం.