
Rashmika Mandanna Remuneration:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా టాక్. ఆమె తాజాగా పారితోషికానికి బదులుగా సినిమాల్లో లాభాల్లో వాటా తీసుకోవాలని డిమాండ్ చేస్తోందట. ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ లాంటి టాప్ హీరోలు ఇలాంటి డీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్మిక కూడా అదే దారిలో వెళ్తుందా అనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
రష్మిక “కిరిక్ పార్టీ” సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, “చలో” సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ ఆమెకు అసలైన బ్రేక్ గీతా గోవిందం (Geetha Govindam) సినిమాతో వచ్చింది. ఆ తర్వాత పుష్ప (Pushpa) సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. “సామీ సామీ” పాట రష్మికను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
View this post on Instagram
బాలీవుడ్‌లో “గుడ్ బై” (Goodbye), “మిషన్ మజ్ను” (Mission Majnu) సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ కాలేదు. కానీ రణబీర్ కపూర్‌తో నటించిన “యానిమల్” (Animal) మాత్రం భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోనూ రష్మికకు బిగ్ డిమాండ్ ఏర్పడింది. తాజాగా, పుష్ప 2 (Pushpa 2), ఛావా (Chhaava), కుబేర (Kubera) సినిమాలు చేస్తున్న రష్మిక.. ఇకనుంచి రెమ్యూనరేషన్‌కు బదులుగా లాభాల్లో వాటా కోరుకుంటోందట.
ఇటీవల పెద్ద హీరోలు రెమ్యూనరేషన్‌కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. ఇప్పుడు రష్మిక కూడా అదే రూట్‌లో ప్రయాణం చేయాలని చూస్తోందని టాక్. సాధారణంగా ఆమె ఒక్కో సినిమాకు రూ. 3-4 కోట్లు తీసుకుంటుంది. కానీ ఇప్పుడు లాభాల్లో 10% వాటా కావాలని డిమాండ్ చేసిందట.
తాజాగా “పుష్ప 2”, “ఛావా” వంటి భారీ విజయాల తర్వాత ఆమె మార్కెట్ పెరిగింది. అయితే హీరోలకు లాభాల్లో వాటా ఓకే, కానీ హీరోయిన్‌కు కూడా ఇదే ఫార్ములా పని చేస్తుందా? అని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ డిమాండ్ వల్ల అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉందా? లేక నిర్మాతలు ఒప్పుకుంటారా? అనేది చూడాలి.
ALSO READ: లీక్ అయిన Nani Hit 3 కథ.. ఎలా ఉందంటే..