HomeTelugu Trendingవిజయ్‌ అంటే.. క్రష్‌ అంటున్న రష్మిక మందన

విజయ్‌ అంటే.. క్రష్‌ అంటున్న రష్మిక మందన

5 15
వరుస సినిమాలతో బిజీగా ఉంది హీరోయిన్‌ రష్మిక మందన.. విజయ్ దేవరకొండతో కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటించింది. ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. అదే విధంగా స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో రష్మికా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక తాజాగా హీరో నితిన్‌తో కలిసి నటించిన ‘భీష్మ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది రష్మిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీ ఫెవరెట్ హీరో ఎవరు అని అడిగితే తడబడకుండా విజయ్ పేరు చెప్పేసింది.

విజయ్ అంటే మన విజయ్ దేవరకొండ అనుకోకండి…తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్. మీకు ఎవరిపై క్రష్‌ ఉంది? భవిష్యత్తులో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారు..? అని యాంకర్ అడగ్గానే రష్మిక స్పందిస్తూ.. తనకు చిన్నతనం నుంచే ఇళయ దళపతి విజయ్‌పై క్రష్‌ ఉండేదని, భవిష్యత్తులో ఆయనతో నటించాలనిఉంది అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది. మరి ఏ ఈ భామకు విజయ్ సినిమాలో ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu