రష్మిక మందన్న పుట్టింది కర్ణాటకలో అయినా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ 2014 అందుకుంది. అంతేకాదు క్లీన్ అండ్ క్లియర్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పని చేసింది. ఆ తరువాత ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రంతో 2016 లో చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ బంపర్ హిట్ అవ్వడంతో రష్మిక వరుసగా అవకాశాలు అందుకుంటూ తెగ సందడి చేస్తోంది. విజయ్ దేవరకొండతో రష్మిక నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలలో రొమాంటిక్ సీన్స్‌లో నటించి సూపర్బ్ అనిపించిన ఈ బ్యూటీ, ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించింది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో, నితిన్ ‘భీష్మ’లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రష్మిక ఎప్పటికప్పుడు కొత్త పిక్స్‌తో కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని పిక్స్ పోస్ట్ చేసిన ఈ భామ.. ఓ పిక్‌లో మ్ మ్.. అంటూ ముద్దులిస్తోంది. మరీ ఆ ముద్దులు ఎవరికో తెలియక తెగ సతమతమవ్వుతున్నారు ఆమె అభిమానులు. అంతేకాదు ఈ పిక్‌పై తెగ కామెంట్స్ చేస్తూ అభిమానులు.