HomeTelugu Big Storiesఫోర్బ్స్‌ జాబితా అండర్‌30 లో రష్మిక మందన్నా

ఫోర్బ్స్‌ జాబితా అండర్‌30 లో రష్మిక మందన్నా

Rashmika mandanna in forbes

టాలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ దూసుకుపోతుంది రష్మిక. ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. తాజాగా ఈఅమ్మడు మరో అరుదైన ఘనతను సాధించింది. తాజాగా ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలో స్థానం సంపాదించుకుంది.

27 ఏళ్ల రష్మిక తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్ గా వెలుగొందుతుంది. ఇటీవలే బాలీవుడ్‌లో యానిమల్‌ మూవీలో అలరించిన రష్మిక టాలీవుడ్‌లో పుష్పా-2లో నటిస్తుంది.

ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేస్తుంది. 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. వీరిలో ముగ్గురు నటీమణులు రాధికా మదన్, రష్మిక మందన్న, డాట్ ఉన్నారు.

ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితా:
అగ్రి బయో టెక్నాలజీ సహ వ్యవస్థాపకులు అంకిత్‌ అలోక్‌ బగారియా
అభిగావ్రి.. విరాజ్‌ ఖన్నా (నటుడు)
శ్రేయాన్స్‌ చోప్రా (సీఈవో మస్టాక్‌) ప్రిహా బిస్వాస్‌ (సీపీవో ఆగ్నిటో)
అజింక్య ధారియా (ప్యాడ్‌ కేర్‌ ల్యాబ్స్‌)
అనుపమ్‌ కుమార్‌, అర్వింద్‌ భరద్వాజ్‌ (మినీ మైన్స్‌ సహ వ్యవస్థాపకులు)
నవజీత్‌ ఖర్కేరా, జగత్‌ బిడ్డప్ప (రాప్చర్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ సహ వ్యవస్థాపకులు)
అభిషేక్‌ ధురానీ, నేత్రా అజంపూర్‌ (క్రియేటివ్‌ ఏజెన్సీ స్టూడియో సార్టెడ్‌ సహ వ్యవస్థాపకులు)
క్రిస్టోఫర్‌ రిచర్డ్‌ (స్టూడియో కార్బన్‌)
అనుష్క రాఠోడ్‌ (డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌)
దీప్‌రాజ్‌ జాదవ్‌ (డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌)
ఆదిత్‌ పలీచా, కైవల్య వోహ్రో (జెప్టో సహ వ్యవస్థాపకులు)
వరుణ్‌ సంఘీ (కార్ ట్రేడ్‌ వెంచర్స్‌)
అనుపమ్‌ పెదార్ల, శశాంక్‌ రెడ్డి గుజ్జుల, రాహుల్‌ అట్లూరి (నెక్ట్స్‌ వేవ్‌ టెక్నాలజీస్‌)
ఉద్ధవ్‌ కుమార్‌ (లింకిట్‌ సీఈవో)
రాధికా మదన్‌ (నటి)
విశేష్‌ ఖన్నా (ఏకే-ఓకే సహ వ్యవస్థాపకుడు)
విశాల్‌ తొలంబియా (హ్యూమానిటీ సెంటర్డ్‌ డిజైన్స్‌ సీఈవో)
సీతా లక్ష్మీ నారాయణ్‌ (ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌)
విష్ణు ఆచార్య (రాజర్‌పే, స్ట్రాటజీ హెడ్‌)
అభిషేక్ అగర్వాల్‌ (ఫార్మ్‌లీ డైరెక్టర్‌)
డాక్టర్‌ నదీమ్‌ అహ్మద్‌ (మెకన్సే అండ్‌ కంపెనీ సీనియర్‌ కన్సల్టెంట్‌)
ఆర్యన్‌ చౌహాన్‌ (జీవోవ్‌ సహ వ్యవస్థాపకుడు)
రామకృష్ణ మెందు, చిరాగ్‌ జైన్‌ (ఎండ్యూర్‌ ఎయిర్‌ సిస్టమ్స్‌ సీఈవో, సీటీవో)
అదిత్‌ సైగల్‌ (నటి, సంగీతకారిణి)
హన్నీ భగచందానీ (టార్చిట్‌ వ్యవస్థాపకుడు)
పరుల్‌ చౌదరి (అథ్లెట్‌)
సుమిత్‌ అంతిల్‌ (పారా అథ్లెట్‌)
జ్యోతి యారాజీ (అథ్లెట్)లు ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu