HomeTelugu TrendingRashmika Mandanna: అదే నిజం చేయాలనిపిస్తుంది.. రెమ్యునరేషన్‌పై రష్మిక కామెంట్స్‌

Rashmika Mandanna: అదే నిజం చేయాలనిపిస్తుంది.. రెమ్యునరేషన్‌పై రష్మిక కామెంట్స్‌

Rashmika Mandanna comments

Rashmika Mandanna: రష్మిక మందన్న రెమ్యునరేషన్ గురించి ఇటీవలే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె రెమ్యునరేషన్ పెంచిందని, ఒక్కో సినిమాకు రూ.4-4.5 కోట్లు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై సోషల్ మీడియా ద్వారా రష్మిక స్పందించింది.

ఇటీవ‌లే బాలీవుడ్‌లో యానిమ‌ల్‌తో సూపర్‌ హిట్‌ అందుకుంది రష్మిక. దీంతో ఆమె రెమ్యూన‌రేష‌న్ ఒక్క‌సారిగా పెరిగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆమె పారితోష‌కంగా 4 కోట్లు దాటిపోయిన‌ట్లు టాక్‌. ఈ పుకార్లు ఎక్కువ అవుతుండటంతో రష్మిక స్పందించింది.

“నేను ఏమనుకుంటున్నానో తెలుసా.. ఇదంతా చూసిన తర్వాత నిజంగానే అలాగే చేయాలని అనిపిస్తోంది. రెమ్యూనరేష‌న్ ఎందుకు పెంచార‌ని నిర్మాత‌లు ఎవ‌రైనా అడిగితే.. మీడియా అలానే చెప్పింది కాబ‌ట్టి దానికే క‌ట్టుబ‌డాల‌నుకుంటున్న‌ట్లు చెబుతా అంటూ స్మైల్ ఎమోజీలు జోడించి ట్యాగ్‌ చేసింది.

ప్రస్తుతం రష్మిక పలు సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ మూవీతో ఈ ఏడాది ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాకుండా రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్స్ మూవీస్ లోనూ ఆమె నటిస్తోంది. హిందీలో చావా అనే మరో మూవీ చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu