Rashmika Mandanna Hindi Movie: నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు తమిళ్ మాత్రమే కాక హిందీలో కూడా రష్మిక వరుస సినిమాలతో ముందుకు దూసుకు వెళుతుంది. ఈ మధ్యనే రష్మిక మందన్న హీరోయిన్ గా రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత రష్మిక మరికొన్ని బాలీవుడ్ ఆఫర్లను అందుకుంది. ఆల్రెడీ రష్మిక మందన్న చావా అనే ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ సరసన సికందర్ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది.
అయితే తాజాగా ఇప్పుడు రష్మిక మందన్న కి బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా సరసన వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న హారర్ కామెడీ యూనివర్స్ వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించనుంది.
ఈ మధ్యనే ముంజియా అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న దినేష్ విజన్ ఇప్పుడు ఆదిత్య సత్పోదర్ దర్శకత్వంలో
వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ హారర్ కామెడీ యూనివర్స్ ను సృష్టించనున్నారు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా తన చేతుల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేశాక ఈ సినిమా మీద దృష్టి పెట్టనున్నారు. ఆయుష్మాన్ ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఒక స్పై కామెడీ సినిమాలో నటిస్తున్నారు. అదికాకుండా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో బార్డర్ 2 సినిమాలో కూడా నటించాల్సి ఉంది.
Rashmika Mandanna Upcoming Movies:
రష్మిక మందన్న కూడా పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ షూటింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలో మాత్రమే కాకుండా రష్మిక మందన్న రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలతో కూడా బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ లో విడుదల కాబోతున్న ధనుష్ కుబేర సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది.