టాలీవుడ్‌లో హీరోయిన్ రష్మిక వరుస సినిమాలతో బీజీగా ఉంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఛలో, గీత గోవిందం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో రష్మికకు యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కు జంటగా నటించి భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది అమ్మడు. ఇక సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప’ లో కూడా హీరోయిన్‌గా రష్మికనే నటిస్తుంది. మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో రష్మిక ప్రస్తుతం అవకాశాలు అందుకుంటోంది.
ఇక ఏ ఇండస్ట్రీలో అయినా కెరీర్ లో ఎదుగుతున్న హీరోయిన్ పై రూమర్స్ రావడం సహజమే.. అలానే రష్మిక పైన కూడా చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా రూమర్స్ పై రష్మిక స్పందిస్తూ ‘మనిషి అన్నాక వ్యక్తిగత సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అది సెలెబ్రిటీ అయితే అవి వార్తలుగా మారుతాయి. వాటిని బేస్ చేసుకుని అనేక పుకార్లు పుట్టుకొస్తాయి. అలాంటి పుకార్లని అసలు పట్టించుకోను.’ అంటుంది. ‘ఇక వరుస సినిమాలో చాలా బిజీగా గడుపుతున్న కాబట్టి అలాంటివి పట్టించుకోను . కెరియర్ ప్రారంభంలో అలాంటివాటికి బాధపడేదాన్ని కానీ ఇప్పుడు అలవాటైపోయింది’ . అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు .