టాలీవుడ్లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ మేడమ్. ఇప్పుడు హీరోయిన్గా వరుస అవకాశాలతో .. హిట్లతో దూసుకుపోతోంది రష్మిక. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుంది. త్వరలో బన్నీ జోడీ కట్టనుంది ఈ బ్యూటీ. సుకుమార్ – బన్నీ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఈమె హీరోయిన్గా నటిస్తుంది. యూత్ లో ఆమెకి గల క్రేజ్ కారణంగా, పారితోషికం విషయంలో నిర్మాతలు ఎంతమాత్రం వెనకడుగు వేయడం లేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు.. నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త షికారు చేస్తుంది. హీరోయిన్లు నిర్మాతలుగా మారడమనేది కొత్త కాదు.. ఎప్పటి నుండో నడుస్తూనే ఉంది. అయితే అందులో సక్సెస్ అయినవాళ్లు చాలా తక్కువ. అయితే కొంత అనుభవం ఉన్న వాళ్లు నిర్మాతలుగా మారారే గానీ, ఆరంభంలోనే ఇటువంటి సాహసం చేయలేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే కెరియర్ ఓనమాలు దిద్దుతున్న సమయంలో ఈ భామ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల, అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.