తెలుగు హాట్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సామాజిక అంశాలపై స్పందించడంతో పాటు.. మూగ జీవాల రక్షణపై ఆమె చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అంతేకాకుండా తన గురించి అసభ్యంగా కామెంట్లు చేసేవారికి ధీటైన సమాధానాలు ఇస్తుంది ఈ బ్యూటీ. ఆదివారం(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ట్విటర్ వేదికగా మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు. తొలి ట్వీట్‌లో మమ్మల్ని సూపర్ ఉమెన్ చేయడం ఆపండి అని ఓ ఫొటోను షేర్ చేశారు. మరో ట్వీట్‌లో మాత్రం కాస్త వ్యంగ్యంగా స్పందించారు. ‘ఓ మహిళ 8 ఏళ్ల నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న దేశంలో.. మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. హ్యాపీ ఉమెన్స్ డే’ అని రష్మి ట్వీట్ చేశారు. నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరు పెడుతున్న ఫొటోను కూడా ఆమె అందుకు జత చేశారు.
అంతకుముందు తనను ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు రష్మి గట్టి కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ‘హోలీ వస్తుంది. కుక్కలపై రంగులు చల్లకండి. మనపై రంగు పడితే సబ్బుతో కడుక్కోవచ్చు. కానీ అవి ఆ పని చేయలేవు’ అని రష్మి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై ఓ నెటిజన్ ‘అచ్చా.. ఈద్ సమయంలో ట్వీట్ చేయండి. హోలీ, దీపావళి ఉన్నప్పుడే మన పండగల ప్రతిష్టను తగ్గించేలా మీకు ఇలాంటివి గుర్తుకువస్తాయి’ అని ట్వీట్ చేశారు. దీనిపై రష్మి స్పందించారు. ఇలాంటి అర్థంలేని చెత్త కామెంట్లు చేసేటప్పుడు ఒకసారి చేసిన ట్వీట్లు అన్ని జాగ్రత్తగా చూడండి అని మండిపడింది ఈ అమ్మాడు.
#HappyWomensDay2020 pic.twitter.com/9vcTW6T5vM
— rashmi gautam (@rashmigautam27) March 8, 2020