HomeTelugu Trendingపాకిస్తాన్ పై మండిపడ్డ రేష్మి .. ట్వీట్‌ వైరల్‌

పాకిస్తాన్ పై మండిపడ్డ రేష్మి .. ట్వీట్‌ వైరల్‌

2 15పుల్వామా ఘటనపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఇప్పటికే యువత తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమం వేదికగా ట్వీట్ చేస్తున్నది. ముర్కులను తరిమి కొట్టాలని, పాక్ కు అనుకూలంగా మాట్లాడే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా పేర్కొంటున్నారు. ఉగ్రవాదుల దాడిపై నటి, యాంకర్ రేష్మి స్పందించింది. ట్విట్టర్ వేదికగా ఓ యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ చేసిన ట్వీట్ పై ఆమె మండిపడింది.

“నువ్వు మావాడివి అయ్యావు కాబట్టి బతికి పోయావు – నీ పాకిస్తాన్ గొప్పదనం ఏంట్రా -దేశ విభజన సమయంలో నువ్వు అవతలి వైపు వెళ్లాల్సింది. మాతోనే మీకు అస్థిత్వం. మూసుకుని కూర్చో అంటూ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ జిందాబాద్ అన్న నువ్వు ఈ దేశానికి ఎలా మొహం చూపుతావు వెళ్లి పాకిస్తాన్ లో ఎలుక పొక్కలో మొహం పెట్టుకో అంది. పుల్వామ దాడికి తెగబడిన ప్రతి ఒక్కరిని కూడా నామ రూపాలు లేకుండా ఏరి వేయాలి. ఇలాంటి నా కొడుకులను ఏం చేసినా పాపం లేదు అంటూ” ట్వీట్ చేసింది. రేష్మితో పాటు పలువురు సెలెబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. రేష్మి చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu