HomeTelugu Trendingమా మథ్య మంచి బంధం ఉంది: రష్మి

మా మథ్య మంచి బంధం ఉంది: రష్మి

6 12హాట్‌ యాంకర్‌ రష్మి లాక్‌డౌన్‌ కారణంగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉంది. తాజాగా ఓ వెబ్‌సైట్‌ ఈమెని ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా రష్మి.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

సుధీర్‌తో తనకి ఉన్న రిలేషన్‌ షిప్‌ గురించి స్పందిస్తూ.. ‘నేనూ సుధీర్‌ నటీనటులం మాత్రమే. స్ర్కిప్ట్‌కి అనుగుణంగా, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు మేమిద్దరం ఉత్తమమైన ప్రదర్శన కనబరుస్తుంటాం. నిజ జీవితంలో మేమిద్దరం గొప్ప స్నేహితులం కూడా కాదు. కాకపోతే మా ఇద్దరి మధ్య ఓ మంచి బంధం ఉంది. అంతే తప్పా అంతకు మించి ఏమీలేదు’ అని తేల్చి చెప్పేసింది రష్మి.

అనంతరం రష్మి ‘గుంటూరు టాకీస్‌’ సినిమా గురించి మాట్లాడుతూ.. ”గుంటూరు టాకీస్‌’ చిత్రంలో సువర్ణ లాంటి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించడం అనేది నేను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఆ సినిమాలో నా పాత్రను చూసి చాలామంది షాక్‌ అయ్యారు. ఆ సినిమా విడుదలైన సమయంలో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో సువర్ణ తరహా పాత్రలు చేయమని చాలా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ ఆ పాత్రలేవీ అనుకున్న స్థాయిలో లేవు. అంతేకాకుండా నాకు మంచి కథతో కూడిన సినిమా ఆఫర్స్‌ రాలేదు. అందుకే నేను బోల్డ్‌ పాత్రల్లో నటించడం తగ్గించాను’ అని రష్మి పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu