HomeTelugu Big Storiesనా ఇష్టంతోనే చేశా.. విజయ్‌ సినిమాపై రాశీఖన్నా కామెంట్స్‌

నా ఇష్టంతోనే చేశా.. విజయ్‌ సినిమాపై రాశీఖన్నా కామెంట్స్‌

8 29
టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ‘వరల్డ్ ఫెమస్ లవర్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రంలో అందాలభామలు రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ హీరోయిన్‌లు నటించారు. అయితే ఈ సినిమాలో రాశి ఖన్నా ఎప్పుడు లేని విధంగా రొమాంటిక్స్ సీన్స్ లో రెచ్చిపోయింది. అయితే ఈ మూవీలో విజయ్ రాశి ఖన్నా రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. అయితే అటువంటి సీన్స్ చేసి తప్పు చేశా అని రాశి భావించినట్టు, ఇక పై అలాంటి సీన్స్ చేయనని చెప్పినట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. తాజగా ఆ వార్తలపై రాశి స్పంచింది. సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తూ తను నటించిన ప్రతి సినిమాను స్వీకరిస్తానని, బాధపడుతూ ఏ సినిమాలోనూ నటించలేదని అన్నారు. ‘చిత్రం విజయం సాధించినా, సాధించకపోయినా.. ప్రతి సినిమా ఒక అందమైన ప్రయాణం. ప్రతి చిత్రం కొత్త విషయాల్ని నేర్పుతుంది. మేమంతా నటులుగా ఇంకాస్త ఎదుగుతాం… నేనెప్పుడూ నా పాత్రల వైపే ఉంటాను. ధన్యవాదాలు’ అని ఆమె
పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu