ప్రముఖ దివంగత నటుడు రావు గోపాల్‌రావు వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు రావు రమేశ్. తనదైన స్టైల్‌లో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చున్నాడు. అయితే ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కనిపించిన రావు రమేశ్.. ఇప్పుడు హీరో అవతారం ఎత్తబోతున్నాడట. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
రావు రమేశ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హ్యాపీ వెడ్డింగ్ ఫేం లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టోరీతో రాబోతున్న ఈ చిత్రంలో రావు రమేశ్ మెయిన్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో అలనాటి తార ఇంద్రజ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది.
మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్‌లో వస్తున్న రెండో చిత్రమిది. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది ఈ సినిమా అని డైరెక్టర్ తెలిపారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం” అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు