HomeTelugu Big Storiesఅసలైన ముద్దుగుమ్మ నాదగ్గర ఉంది

అసలైన ముద్దుగుమ్మ నాదగ్గర ఉంది

9 13అసలైన ముద్దుగుమ్మ దీపికా పదుకొణె తన దగ్గరుందని బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ అంటున్నారు. లండన్‌లోని మేడం టుసాడ్స్‌లో దీపిక మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గురువారం విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీపిక, రణ్‌వీర్‌ సందడి చేశారు. వారితోపాటు ప్రకాశ్‌ పదుకొణె, ఉజ్జల పదుకొణె, అంజు భవాని, జగ్జీత్‌ సింగ్‌లు కూడా హాజరయ్యారు. కాగా తన సతీమణి మైనపు విగ్రహంతో కలిసి దిగిన ఫొటోలను రణ్‌వీర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘దీపికా పదుకొణె 2.0. ఒరిజినల్‌ నా దగ్గర ఉంది’ అని పేర్కొన్నారు. విగ్రహం చాలా ముద్దుగా ఉందంటూ హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. లవ్‌ ఎమోజీలను కూడా షేర్‌ చేశారు. రణ్‌వీర్‌ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. కేవలం 12 గంటల్లోనే దాదాపు 1.4 మిలియన్ల మంది లైక్‌ చేశారు.

9a

లండన్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల దీపిక ఆనందం వ్యక్తం చేశారు. విగ్రహం తయారు చేయడానికి తొలుత మేడం టుసాడ్స్‌ బృందం తనను సంప్రదించినప్పుడు.. ‘విగ్రహం ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి?’ అని అనుకున్నట్లు చెప్పారు. దీని వల్ల అభిమానులకు మేలు జరుగుతుందనే విషయం తర్వాత అర్థమైందని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu