పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్ రైల్వే స్టేషన్‌లో ఓ రోజు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు తియ్యటి స్వరం వినిపించింది. ఎవరా అని చూస్తే అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. లెజండరీ గాయని లతా మంగేష్కర్ ఆలపించిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ అనే పాట పాడుతూ కనిపించారు. చూడటానికి చింపిరి జుట్టుతో తినడానికి తిండి కూడా లేకుండా బాధపడుతున్న నిరుపేద మహిళగా కనిపించారు. కానీ ఆమె స్వరం మాత్రం వినసొంపుగా ఉంది. ఇంకేముంది.. ప్రయాణికులంతా ఆమె టాలెంట్‌కు షాకైపోయారు. అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆమె పాడుతున్నప్పుడు వీడియో రికార్డ్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఆమె బాలీవుడ్ సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకున్నారు. ఆమే.. రేణూ మోండల్. రైలులో ప్రయాణిస్తూ కాలక్షేపం కోసం ఆమె పాడిన పాట ఇప్పుడు సోషల్‌మీడియా సెన్సేషనల్ సెలబ్రిటీని చేసింది. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేశ్ రేషమ్మియా తాను తెరకెక్కిస్తున్న సినిమాలో పాట పాడే అవకాశం కల్పించారు. రేణూ పాట పాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నా సినిమా కోసం టాలెంటెడ్ రేణూ మోండల్ చేత పాట పాడించుకున్నాను. మనం కన్న కలలను సాకారం చేసుకోవాలన్న ధైర్యం, పాజిటీవ్ యాటిట్యూడ్ ఉంటే చాలు.. అవి నిజమైపోతాయి’ అని పేర్కొన్నారు.
A women working Ranaghat station in West BengalWhat a voice, felt in love with this voice 😊#krishaandaszubu
Posted by BarpetaTown The place of peace on Sunday, July 28, 2019