ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ తో బుల్లితెర ప్రేక్షకులను దగ్గరైన నటుడు మహేశ్ పెళ్లి గురువారం ఉదయం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని శివకోడు గ్రామానికి చెందిన పావని అనే అమ్మాయిని ఆయన వివాహమాడారు. కరోనా వైరస్ కారణంగా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాల ద్వారా మహేశ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.