మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సమంత అక్కినేని జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలోని ‘రంగమ్మా మంగమ్మా..’ పాట యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ పాటను 100 మిలియన్లు (10 కోట్లు) మందికిపైగా వీక్షించారు. ఈ ఏడాదిలో అతి తక్కువ సమయంలో పది కోట్ల మార్క్‌ను దాటిన తొలి దక్షిణాది పాటగా రికార్డు సృష్టించినట్లు చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి.
ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రామ్‌చరణ్ చిట్టిబాబు పాత్రలో, సమంత రామలక్ష్మి పాత్రల్లో నటించారు. మార్చిలో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది. ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విలక్షణ నటులు జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ప్రతినాయకుల పాత్రలు పోషించారు. పూజా హెగ్డే ‘జిగేల్ రాణి’ అనే పాటలో మెరిశారు. 1980ల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఎక్కువగా రాజమండ్రిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా కోసం దాదాపు 30 ఏకరాల్లో చిన్న ఊరిని సృష్టించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.